Khaleda Zia under intensive care బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చైర్‌పర్సన్, మాజీ ప్రధాన మంత్రి బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గుండె, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాబోయే 12 గంటలు చాలా కీలకమని వైద్యులు ప్రకటించారు.
జియా కోసం ఏర్పాటు చేసిన వైద్య బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎఫ్‌ఎం సిద్ధిఖీ ఆమె ఆరోగ్యపరిస్థితిపై నిన్న రాత్రి మీడియాకు వివరించారు. "గత కొన్ని నెలలుగా, తరచుగా అనేక సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆమె( ఎవర్‌కేర్ హాస్పిటల్) చికిత్స పొందుతున్నారని, ఛాతీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమెకు పర్మినెంట్ పేస్‌మేకర్, స్టంట్స్ వేయడం, గుండె సంబంధిత సమస్యలతో మిట్రల్ స్టెనోసిస్ అనే పరిస్థితితో కూడా బాధపడుతున్నారన్నారు. యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని , మరోవైపుఅమెరికాకు చెందిన వైద్య నిపుణులు వర్చువల్‌గా సాయం అందిస్తున్నారని తెలిపారు
ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా, గుండె, ఊపిరితిత్తులు ఒకేసారి ప్రభావితమయ్యాయి. దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది ఏర్పడిందన్నారు. బేగం జియాను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని , రాబోయే 24 గంటల్లో వచ్చే రిపోర్ట్స్ కీలకమని ప్రొఫెసర్ సిద్ధిఖీ తెలిపారు.
బేగం జియా అస్వస్థత వార్తలతో బీఎన్‌పీ నేతలు, శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్య నాయకులు ఆమె ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.


