breaking news
intensive care
-
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స
Khaleda Zia under intensive care బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చైర్పర్సన్, మాజీ ప్రధాన మంత్రి బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గుండె, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాబోయే 12 గంటలు చాలా కీలకమని వైద్యులు ప్రకటించారు.జియా కోసం ఏర్పాటు చేసిన వైద్య బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎఫ్ఎం సిద్ధిఖీ ఆమె ఆరోగ్యపరిస్థితిపై నిన్న రాత్రి మీడియాకు వివరించారు. "గత కొన్ని నెలలుగా, తరచుగా అనేక సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆమె( ఎవర్‌కేర్ హాస్పిటల్) చికిత్స పొందుతున్నారని, ఛాతీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమెకు పర్మినెంట్ పేస్‌మేకర్, స్టంట్స్ వేయడం, గుండె సంబంధిత సమస్యలతో మిట్రల్ స్టెనోసిస్ అనే పరిస్థితితో కూడా బాధపడుతున్నారన్నారు. యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని , మరోవైపుఅమెరికాకు చెందిన వైద్య నిపుణులు వర్చువల్‌గా సాయం అందిస్తున్నారని తెలిపారుఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా, గుండె, ఊపిరితిత్తులు ఒకేసారి ప్రభావితమయ్యాయి. దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది ఏర్పడిందన్నారు. బేగం జియాను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని , రాబోయే 24 గంటల్లో వచ్చే రిపోర్ట్స్ కీలకమని ప్రొఫెసర్ సిద్ధిఖీ తెలిపారు. బేగం జియా అస్వస్థత వార్తలతో బీఎన్పీ నేతలు, శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్య నాయకులు ఆమె ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
ఇంటెన్సివ్ కేర్ లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
-
ఐసీయూలో అమ్మానాన్నలకు.. వెంటనే కూతురికి పెళ్లి
చికాగో : అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జుబల్ కిర్బీ (49) నయంకాని జబ్బుతో మూడు వారాలుగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. అతని ఆరోగ్యం దాదాపుగా మెరుగుపడే అవకాశాలు లేవని వైద్యులు ధృవీకరించారు. ఇంతటి విషాదకర సమయంలోనూ అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నీళ్లు నిండిన కళ్లతోనే తన జీవితంలో అతి ముఖ్యమైన రెండు సంతోషకర ఘట్టాలను తన గుండెల్లో పదిలపర్చుకున్నాడు. సుదీర్ఘం కాలంగా సహజీనం చేస్తున్న కొలీన్ ను జుబల్ పెళ్లాడటం ఒకటయితే, మరొకటి అతని గారాల కూతురు కైలా వివాహ వేడుక. వేడుకలు వివరాల్లోకి వెడితే జుబల్ తీవ్రమైన శ్వాసకోశ (పల్మనరీ ఫైబ్రోసిస్) వ్యాధితో బాధపడుతున్నాడు. రోజురోజుకి మృత్యువుకు చేరువవుతున్నాడు. ఈ సమయంలో గత సోమవారం కొల్లీన్ కిర్బీని చట్టబద్ధంగా తన భార్యను చేసుకున్నాడు. 26 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కోసం ఎదురు చూసే టైం లేదు. అందుకే ఇదే సరైన సమయమని భావించారు. అంతే కూతుళ్లు కూడా లేకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నే వేదికగా ఎంచుకున్నారు. కూతురు కైలా (20) కు వచ్చే సంవత్సరం జూలై 16న పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు. కానీ జుబల్ పరిస్థితి క్షీణిస్తూ వుండడంతో కైలా తన నిర్ణయం మార్చుకుంది. అత్యవసరంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రి సమక్షంలోనే జుబల్ చికిత్స పొందుతున్న ఇంటెన్సివ్ కేర్ రూమ్‌లోనే తమ పెళ్లి జరగాలని కోరుకుంది. హాస్పిటల్ లోని డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులే అతిధులు కాగా జుబల్ ఆనందబాష్పాల్ని చూస్తూ కైలా కిర్బీ, డానియల్ పార్దూ ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకను చూస్తున్న జుబల్ ఆక్సిజన్ మాస్క్ తీసేసి కన్నకూతురును ఆప్యాయంగా ముద్దాడాడు. దీంతో అక్కడంతా గంభీర వాతావరణం నెలకొంది. దాదాపు 50 మంది హాజరైన ఆ వేడుకకు ఆసుపత్రి సిబ్బంది కేక్ లు, పూలతో సహా అన్ని ఏర్పాటు చేశారు. నాకు సంతోషంగా ఉంది.. కానీ...నాన్న నా పక్కన నిలబడాలనుకున్నా.. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంది నవవధువు కైలా. తను కోరుకున్నట్టుగా, అనుకున్నట్టుగానే అన్నీ ఇవ్వలేకపోయినా...కనీసం తండ్రి కళ్లముందు పెళ్లి జరగాలన్న కైలా కోరికను తీర్చగలిగానంటూ ఆమె బంధువు చెప్పారు.


