రెండో పెళ్లి.. ఇప్ప‌టికీ విడిగానే.. యానివ‌ర్సరీ మాత్రం గొప్ప‌గా | Dharmendra and Hema Malini Celebrates 44th Wedding Anniversary | Sakshi
Sakshi News home page

పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి.. వీరీ ప్రేమ‌బంధానికి 44 ఏళ్లు

Published Fri, May 3 2024 5:51 PM | Last Updated on Fri, May 3 2024 5:59 PM

Dharmendra and Hema Malini Celebrates 44th Wedding Anniversary

ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియ‌దు. ఒక్క‌సారి మ‌న‌సులు క‌లిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మ‌రీ ఒక్క‌ట‌య్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియ‌ర్ జంట ధ‌ర్మేంద్ర‌- హేమ‌మాలిని విష‌యంలో ఇదే జరిగింది. ధ‌ర్మేంద్ర‌తో ప్రేమ‌లో ప‌డేనాటికే అత‌డికి ప్ర‌కాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంట‌కు న‌లుగురు పిల్ల‌లు సంతానం. 

రెండో పెళ్లి
ఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమ‌మాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమ‌మాలిని భర్తతో క‌లిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమ‌మాలిని దండ‌లు మార్చుకున్నారు. భ‌ర్త ప్రేమ‌గా ముద్దుపెడుతుంటే సిగ్గుప‌డిపోయింది హేమ‌. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

అప్పుడే చిగురించిన ప్రేమ‌
హేమ‌మాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా విన‌కుండా 1980లో ఈ జంట‌ పెళ్లి పీట‌లెక్కింది.  వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధ‌ర్మేంద్ర త‌న మొద‌టి భార్య‌తో క‌లిసి ఒకే ఇంట్లో ఉండ‌గా హేమ‌మాలిని త‌న పిల్ల‌ల‌తో వేరుగా ఉంటోంది.

 

చ‌ద‌వండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్‌మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement