అది పెళ్లిచూపులు.. ఇది ఎంగేజ్‌మెంట్‌.. అందంగా ముస్తాబైన శోభా | Shobha Shetty Shares Her Engagement Preparation Video | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్‌మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ

May 3 2024 3:07 PM | Updated on May 3 2024 4:32 PM

Shobha Shetty Shares Her Engagement Preparation Video

నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యామంటూ శోభ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది.

మోనిత‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా గుర్తుండిపోయిన పేరు. కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్‌తో బాగా ఫేమ‌స్ అయిందీ బ్యూటీ. త‌ర్వాత తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజ‌న్‌లో అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ రియాలిటీ షోలోనే తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. న‌టుడు య‌శ్వంత్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు తెలిపింది. వీరిద్ద‌రూ కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో క‌లిసి న‌టించారు. షార్ట్ ఫిలింస్‌లోనూ న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది.

నిశ్చితార్థం
బిగ్‌బాస్ అయిపోగానే పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందీ బ్యూటీ. అందులో భాగంగానే జ‌న‌వ‌రిలో పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చూపులు నిర్వ‌హించారు. ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం పెట్టుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యామంటూ శోభ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది.

చిరున‌వ్వుతో ప‌ల‌క‌రింపు
చేతుల నిండా మెహందీ వేసుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో అందంగా ముస్తాబైంది. ప‌సుపు రంగు బ్లౌజ్‌కు మ‌గ్గం వర్క్ వేయించింది. దీనికి లైట్ క‌ల‌ర్‌లో ఉన్న చీర‌ను మ్యాచ్ చేసింది. త‌న ఎంగేజ్‌మెంట్ కోసం వ‌చ్చిన అందరినీ చిరున‌వ్వుతో ప‌ల‌కరించింది. ఈ వీడియో చూసిన అభిమానులు శోభా శెట్టికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

 

    

Advertisement
 
Advertisement
Advertisement