నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్ | Esha Deol Gives Clarity On Father Dharmendra Death Rumours, Says Father Is Recovering Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Dharmendra Death Rumours: ధర్మేంద్ర చనిపోలేదు.. భార్య హేమమాలిని ‍క్లారిటీ

Nov 11 2025 9:51 AM | Updated on Nov 11 2025 10:48 AM

Esha Deol Clarifies Father Dharmendra Death

బాలీవుడ్ దిగ్గజ హీరో ధర్మేంద్ర చనిపోయారని ఉదయం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాన్న మరణించలేదని, మీడియాలో వస్తున్నవి అవాస్తవాలని ఈయన కూతురు ఈషా డియోల్ అంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగానే పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తికమక పడుతున్నారు.

గత కొన్నాళ్లుగా శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. వెంటిలేటర్‌పై ఉన్నారని సోమవారం సాయంత్రం వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన ఆయన టీమ్.. ఏం ఇబ్బంది లేదని, బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఉదయానికల్లా మొత్తం మీడియాలో ధర్మేంద్ర చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ ఈయన కూతురు ఈషా మాత్రం తండ్రి ప్రస్తుతం కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది.

అలానే ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని కూడా చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. 'జరిగిన దాన్ని క్షమించలేం. చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న వ్యక్తి గురించి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారు? ఇది ఆయన్ని అగౌరవపరచడమే. మా కుటుంబానికి గౌరవం ఇవ్వడంతో పాటు కాస్త ప్రైవసీ కూడా ఇవ్వండి' అని హేమమాలిని ట్వీట్ చేశారు.

ధరేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ప్రకాశ్ కౌర్‌కి పుట్టిన కొడుకు సన్నీ డియోల్, బాబీ డియోల్. హేమామాలినికి ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement