'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ | Actor sivaji request to All movie fans watch to dandora movie | Sakshi
Sakshi News home page

'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ

Dec 27 2025 7:42 AM | Updated on Dec 27 2025 7:42 AM

Actor sivaji request to All movie fans watch to dandora movie

నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు నటించిన దండోరా సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. కుల‌వివ‌క్ష గురించి దర్శకుడు మురళీకాంత్ చక్కగా చూపారని రివ్యూవర్లు కూడా చెబుతున్నారు. కానీ, థియేటర్‌లో మాత్రం పెద్దగా ప్రేక్షకులు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన చేసిన డర్టీ కామెంట్సే.. సోషల్‌మీడియాలో ఆయన్ను సమర్థించిన వారందరూ వెళ్లి సినిమా చూసినా భారీ కలెక్షన్స్‌ వచ్చేవని కొందరు సెటైర్స్‌ కూడా వేస్తున్నారు. అయితే, తాజాగా దండోరా సినిమా చూడాలని ప్రేక్షకులను శివాజీ వేడుకున్నాడు.

దండోరా సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే, తన వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్‌ చేయాలని కోరాడు. ప్రతి ఒక్కరూ చూడండి. లేదంటే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని తెలిపాడు. తనతో ఏదైన సమస్య ఉంటే మిగిలిన విషయాల గురించి మరోచోట మాట్లుడుకుందామని చెప్పాడు. కావాలంటే తాను కూడా థియేటర్‌కు వస్తానన్నాడు. ఏం మాట్లాడాలన్నా అందరం థియేటర్లోనే మాట్లాడుకుందామన్నాడు.

అయితే, దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ ఇలా అన్నాడు. 'కొద్దిరోజుల క్రితం జరిగిన వేడుకలో  దొర్లిన రెండు మూడు మాటల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎవరూ జడ్జ్‌ చేయకండి. ఈ సినిమా కోసం నేను సుమారు మూడేళ్లు పైగానే కష్టపడ్డాను. నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి శ్రమకు ఫలితం తెరపై కనిపించింది. ఇప్పుడు చాలా సినిమాలు పోటీలో ఉన్నా సరే మా కథపై నమ్మకంతోనే భయపడకుండా సినిమా విడుదల చేశాం' అని  దర్శకుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement