బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ధర్మేంద్ర వెళ్లారని చెబుతున్నారు. సోషల్మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని వారు కోరుతున్నారు.
ఆసుపత్రిలో ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్( Bobby Deol) కూడా ఉన్నారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉండటం వల్ల కొన్ని వైద్య పరీక్షలు చేపిస్తున్నట్లు చెప్పారు. చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. కానీ, డిశ్చార్జ్ తేదీపై వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర డిసెంబర్‌లో తన 90వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిదే. వృత్తిపరంగా, ధర్మేంద్ర చివరిసారిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో నటులు షాహిద్ కపూర్, కృతి సనన్ నటించారు.


