నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ (తెలుగు, కన్నడ భాషల్లో..) ఈవెంట్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ కూడా చేశాను. సినిమా బాగా వచ్చింది’’ అని చెప్పారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా షూటింగ్‌ను 45 రోజుల్లోనే పూర్తి చేశాం. ప్రేమ–పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడుల మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది చేసిన రోల్ థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, కృష్ణసాయి, అడివి సాయికిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు అతిథులుగా పాల్గొని, సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వీ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆరోహణ సుధీంద్ర – సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో సంగీతం అందించారు.


