శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘45 ది మూవీ’. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్
ప్రకటించి, ట్రైలర్‌ని విడుదల చేశారు.
‘‘45 ది మూవీ’ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్, గ్లింప్స్ మా సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాయి. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ లుక్ అదిరిపోతుంది. ఉపేంద్ర యాక్షన్, డైలాగ్ డెలివరీ అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. విజువల్స్, నేపథ్య సంగీతం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ‘45 ది మూవీ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు.


