మోహన్ లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘వృషభ’. ఈ ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రంలో సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రల్లో నటించారు. నందకిశోర్ దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.
తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రం తెలుగు వెర్షన్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నన్ను దాటి మా నాన్నను నువ్వు ఏమీ చేయలేవు, నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధం’ వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి.


