నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓ ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఈమెపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అషు తొలుత స్పందించింది. ఈమె తండ్రి వెంకటకృష్టారెడ్డి అయితే ఇవన్నీ ఆరోపణలు అని కొట్టిపారేశారు. అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయి, విడాకులు తీసుకున్నాడని.. ధర్మేంద్ర కుటుంబంపై కాల్ మనీ కేసు కూడా ఉందని సంచలన నిజాలు బయటపెట్టారు.
(ఇదీ చదవండి: కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ)
వీళ్లిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? అని అంతా అనుకుంటున్న టైంలో అషురెడ్డి పేరిట ఓ ఆడియో బయటకొచ్చింది. తీసుకున్న డబ్బులో కోటిన్నర రూపాయలని మే నెలలో తిరిగిచ్చేస్తానని.. మిగతా డబ్బు మాత్రం తాను జీవితంలో స్థిరపడినప్పుడు, తన దగ్గరున్నప్పుడు ఇస్తానని సదరు ఆడియోలో అషురెడ్డి చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వేణుస్వామి, ప్రవీణ అక్క సమక్షంలో కూర్చుని మాట్లాడుకుందామని, ఇది కాదంటే తిరిగే కేసు పెడతానని అషు అన్నట్లు అందులో వినిపించింది.
ఈ కేసులో భాగంగానే అషురెడ్డి తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు అషురెడ్డి బాధితుడు ధర్మేంద్రకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ధర్మేంద్ర మాట్లాడుతూ.. 2 నెలల క్రితమే ఆమెపై ఫిర్యాదు చేశాం. అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే ఈ నెల 20న పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
గత ఏడాది కాలంగా డబ్బులు తిరిగివ్వడం గురించి చర్చలు నడుసున్నాయి. మీడియేటర్స్ ఈ మేటర్ సెటిల్ చేద్దామనుకున్నారు గానీ ఈ అమ్మాయి(అషు) అస్సలు వినట్లేదు. దీంతో వాళ్లు డ్రాప్ అయిపోయారు. మేం డబ్బులు అడగలేదు. గోల్డ్ కావాలని అడిగాం. నా ఇల్లు నాకు ఇచ్చేయమని అడిగాను. చాలా మీటింగ్స్, చాలా డిస్కషన్స్ తర్వాతే కేసు పెట్టాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ వదల్లేదు. మొదట నుంచి ఆమెపై కేసు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నాపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తోంది. పరిస్థితి ఇక్కడితో ఆగదని భావించి మా నాన్న కేసు పెట్టాల్సి వచ్చింది.
(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత రెండేళ్లలో బంగారం, ఫ్లాట్ నాతో కొనిపించింది. దీనికోసం నేను అప్పు చేయడంతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసరికి నేను ఇచ్చిన డబ్బులు, ఆస్తులు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది. నేను ఇచ్చిన ప్రతి రూపాయికీ ఆధారాలు ఉన్నాయి. ఆ అన్ని డాక్యుమెంట్స్ పోలీసులకు అందజేశాం. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఆమెపై పోరాటం కొనసాగిస్తాను.
నాకు పెళ్లయి విడాకులు తీసుకున్న సంగతి అషురెడ్డికి ముందే తెలుసు. అయినా సరే ఆమె తండ్రి వింత వింత స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. డబ్బులిచ్చిన మాట వాస్తవమే అని అంటున్నారు. నేనేదో విడాకుల విషయం దాచి పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్లు నా గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర వాట్సాప్ రికార్డులు అన్నీ ఉన్నాయని ధర్మేంద్ర తన వెర్షన్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది)


