'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది | Yash Toxic Movie Postponed Again | Sakshi
Sakshi News home page

Toxic Movie: బజ్ లేక సతమతం.. దీనికి తోడు మళ్లీ వాయిదా

Apr 29 2026 11:19 AM | Updated on Apr 29 2026 11:31 AM

Yash Toxic Movie Postponed Again

మనం ఎలాంటి సినిమా తీశామనేది ముఖ్యం కాదు చెప్పిన టైంకి రిలీజ్ చేశామా లేదా అనేది ప్రేక్షకులు చూస్తారు. ఒకసారి వాయిదా పడింది అంటే సరేలే ఏదో సమస్య ఉండొచ్చు అనుకుంటారు. కానీ మళ్లీ మళ్లీ వాయిదా పడితే లేనిపోని సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నట్లే యష్ 'టాక్సిక్' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన ‍సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)

ఈ సినిమాని జూన్ 4న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అది కుదరడం లేదు. మూవీ అయితే సిద్ధంగా ఉందని కానీ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్, భాగస్వామ్యాలు జరుగుతున్న కారణంగా విడుదల తేదీని మారుస్తున్నాం. ప్రపంచవ్యాప్తగా ఒకే తేదీకి రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కాస్త టైమ్ తీసకుని, అత్యుత్తమ ఔట్‌పుట్ అందించాలనుకుంటున్నామని హీరో, నిర్మాత యష్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో యష్ హీరో కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించింది. 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్.. ఈ చిత్రాన్ని కూడా యష్‌తో కలిసి నిర్మించింది. తొలుత మార్చి 19 అనుకున్నారు కుదర్లేదు. జూన్ 4 అనుకున్నారు కుదర్లేదు. మరి ఈసారైనా ఓ తేదీ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి?

ఇకపోతే ఈ చిత్రం నుంచి ఇ‍ప్పటికే ఓ గ్లింప్స్ వీడియో, పాట రిలీజ్ చేశారు గానీ ఏ మాత్రం హైప్ ఏర్పడలేదు. ఇప్పుడిలా వాయిదాల మీద వాయిదాలు పడితే దీనిపై ఉన్న కాస్తోకూస్తో హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది.

(ఇదీ చదవండి: కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement