హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన ‍సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్ | Political Satire TN 2026 Movie OTT Release Date Confirmed, Check Out Multiple OTT Streaming Platforms Details | Sakshi
Sakshi News home page

TN 2026 OTT Release: మూడు వారాలకే ఓటీటీలోకి కొత్త మూవీ

Apr 29 2026 10:16 AM | Updated on Apr 29 2026 11:00 AM

TN 2026 Movie OTT Release Date Update

గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.

(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్‌స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)

Advertisement
 
Advertisement
Advertisement