breaking news
TN 2026 Movie
-
ఓటీటీలోకి వచ్చిన సినిమా.. సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి
గత నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకోగా.. హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈయన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా ఓ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడిది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)'టీఎన్ 2026' పేరుతో తీసిన ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్ ప్రధాన పాత్ర చేశాడు. కమెడియన్ తంబి రామయ్య.. స్టోరీ అందించడంతో పాటు కీలక పాత్ర చేశాడు. ఈయన కొడుకు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ మూవీ.. జనాల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వ్యర్థ ప్రయత్నంగా మిగిలింది. గత నెల చివరి వారంలో ఐదు ఓటీటీల్లోకి తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్) -
హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్
గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)


