ఓటీటీలోకి వచ్చిన సినిమా.. సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి | TN 2026 Movie Telugu Version Released In OTT, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

TN 2026 OTT: పొలిటికల్ డ్రామా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ

May 22 2026 2:42 PM | Updated on May 22 2026 4:21 PM

TN 2026 Movie OTT Telugu Streaming Now

గత నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకోగా.. హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈయన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా ఓ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడిది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)

'టీఎన్ 2026' పేరుతో తీసిన ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్ ప్రధాన పాత్ర చేశాడు. కమెడియన్ తంబి రామయ్య.. స్టోరీ అందించడంతో పాటు కీలక పాత్ర చేశాడు. ఈయన కొడుకు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ మూవీ.. జనాల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వ్యర్థ ప్రయత్నంగా మిగిలింది. గత నెల చివరి వారంలో ఐదు ఓటీటీల్లోకి తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.

'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement