సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie Gayapadda Simham Released In OTT, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Gayapadda Simham Ott: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

May 22 2026 10:25 AM | Updated on May 22 2026 1:56 PM

Tollywood Movie GayapaddaSimham Streaming On This Ott

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రైడే ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. మరికొన్ని సడన్‌గా ఓటీటీల్లో దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

తాజాగా ఇవాళ ఎలాంటి హడావుడి లేకుండానే ఓ తెలుగు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో వచ్చిన చిత్రం గాయపడ్డ సింహం. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.   
 
ఈ సినిమా కథేంటంటే..

దరహాస్‌(తరుణ్‌ భాస్కర్‌), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్‌ పెట్టడంతో.. దరహాస్‌ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల వెన‌క్కి వ‌చ్చిన (డిపోర్ట్) భార‌తీయ విద్యార్థుల్లో దరహాస్‌ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్‌పై దరహాస్‌ పగపడతాడు. ఎలాగైన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్‌ టార్చర్‌ భరించలేక ఫ్రెండ్‌ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్‌పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్‌ పగకు మాఫియా డాన్‌ బ్రూటల్‌ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్‌(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement