Thambi Ramaiah
-
హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్
గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..) -
ఈ సినిమాలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదు!
ఇటీవల టీఎన్ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల వచ్చాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్‌అర్జున్ టీఎన్–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్రవి, కందన్రవి, దీపక్ రవి నిర్మించిన చిత్రం టీఎన్ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు, అర్జున్ సర్జా అల్లుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నట్టి కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్ 2026 చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదని నట్టి పేర్కొన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ కొడుకు
తమిళసినిమా: కమెడియన్ తంబి రామయ్య వారసుడు ఉమాపతి తంబిరామయ్య కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం పిత్తల మాత్తి. మాణిక్య విద్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ శరవణ ఫిలిం ఆర్ట్స్ పతాకంపై జి.శరవణన్ నిర్మించారు. నటి సంస్కృతి నాయకిగా నటించిన ఇందులో బాలశరవణన్, వినుతాలాల్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుత్ లేఖారామన్, ఆడుగలం నరేన్, కాదల్ సుకుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. మోసస్ సంగీతాన్ని, ఎస్ఎన్ వెంకట్ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న పిత్తల మాత్తి చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను నిర్మాత శరవణన్ తెలుపుతూ ఒక యువకుడు మంచి కోసం ఏమేమి చేయాల్సి వచ్చింది వివరించే కథాచిత్రంగా ఇది ఉంటుందన్నారు. అతను ఏది మంచి ఏది చెడు తెలుసుకుని జీవితంలో పైకి రావడానికి ఏం చేశాడు అనే పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్రం సాగుతుందన్నారు. చిత్రాన్ని ఈనెల 28న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.


