కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ | Nagarjuna First Review On Son Akhil's Lenin Movie | Sakshi
Sakshi News home page

Nagarjuna Lenin Movie: వాయిదా కాదు.. 'పెద్ది'తో బాక్సాఫీస్ బరిలో

Apr 29 2026 10:52 AM | Updated on Apr 29 2026 11:04 AM

Nagarjuna First Review On Son Akhil's Lenin Movie

హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్‌స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)

అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.

'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్‌ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన ‍సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement