రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్‌ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)
ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.
అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్‌లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష‍్మీ)


