యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘బిగ్‌బాస్‌’ ఫేం నిఖిల్‌ పాట | Bigg Boss 9 Telugu: Bigg boss Fame Nikhil Latest Song Thenela Vanala Top In Youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘బిగ్‌బాస్‌’ ఫేం నిఖిల్‌ పాట

Nov 27 2025 3:22 PM | Updated on Nov 27 2025 3:22 PM

Bigg Boss 9 Telugu: Bigg boss Fame Nikhil Latest Song Thenela Vanala Top In Youtube

యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది.  ఈ క్రమంలో ఓ మెలోడీ గీతాన్ని వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న వదిలారు. ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది.

కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్‌ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచి తెహ్లాన్ ఎంతో అందంగా కనిపించారు. నిఖిల్‌ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌‌తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చినట్టు అయింది.

‘తేనెల వానలా’ పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లోనే ఈ పాట ప్రసారం అవుతోంది. వీహ అద్భుతమైన గానం, హృదయాన్ని హత్తుకునేలా చరణ్ అర్జున్ ఇచ్చి బాణీ, సాహిత్యం ఈ పాటను అందరికీ మరింత చేరువ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement