శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రత్నమాల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.


