ఆంధ్ర కింగ్‌ తాలూకా.. రన్‌ టైమ్ ఎంతంటే.! | Ram Pothineni Andhra King Thaluka sensor completed | Sakshi
Sakshi News home page

Andhra King Taluka Movie: ఆంధ్ర కింగ్‌ తాలూకా.. రన్‌ టైమ్ ఎంతంటే.!

Nov 25 2025 6:40 PM | Updated on Nov 25 2025 8:54 PM

Ram Pothineni Andhra King Thaluka sensor completed

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్కు ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు యూ/ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మూవీ రన్టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా(యాడ్స్, టైటిల్స్‌తో సహా) ఉండనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 

ఈ చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. రామ్ పోతినేని ఎనర్జిటిక్‌ ఫర్మామెన్స్‌ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఎమోషనల్‌గా అభిమానులను అలరించనున్నారు. ఆంధ్ర కింగ్‌ తాలూకా చిత్రంలో ఎమోషనల్ ఫర్మామెన్స్‌తో ఆకట్టుకోనున్నారు. ఈ మూవీలో రామ్ పాత్ర సినీ ప్రియులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement