ఆధునిక వైద్యం కొంత పుంతలు తొక్కుతున్న వేళ..చాలామంది ప్రకృతి వైద్యం వైపుకే మగ్గు చూపుతున్నారు. ఆఖరికి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వాటినే ప్రమోట్ చేస్తుండటం విశేషం. అయితే పూర్తిగా ప్రకృతి వైద్య మీద ఆధారపడితే కష్టం అని..ఆధునిక చికిత్సల తోపాటు దీన్ని తీసుకుంటే బెటర్ అనేది కొందరి నిపుణులు వాదన. అయితే తాజాగా టాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఈ ప్రకృతి వైద్యంపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్‌టాపికగ్ మారింది. పైగా ఆమెకు పిచ్చి పట్టిందా అంటూ తిట్టిపోస్తున్నారు కూడా. కానీ సోనాలి మాత్రం తన వాదనను సమర్థించడమే కాదు అది తన అనుభవం అని నొక్కి చెబుతూ మరోసారి పోస్ట్ పెట్టారామె. అసలు ఇంతకీ ఆమె ఏం అన్నారు? అన్నింట్లకంటే ప్రకృతి వైద్యమే మంచిదా అంటే..
గతవారం సోషల్ మీడియ ఎక్స్‌లో ఆటోఫాగి గురించి రాసుకొచ్చింది. తనకు 2018లో కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, అప్పుడే తన ప్రకృతి వైద్యుడు ఈ సహజ చికిత్సను పరిచయం చేసినట్లు తెలిపింది. దానిగురించి పరిశోధించి మరీ అనుసరించినట్లు పేర్కొంది. ఆ ఆటోఫాగిని ఇప్పటికీ అనుసరిస్తున్నట్లు తెలిపింది.
ఆటోఫాగి అంటే..
ఒక కణం తనను తాను శుభ్రం చేసుకునే సహజ ప్రక్రియ, దీని ద్వారా అది పాత, దెబ్బతిన్న కణ భాగాలను విచ్ఛిన్నం చేసి, వాటిని తిరిగి ఉపయోగించుకుంటుంది. ఇది కణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, కణాలలో శక్తిని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఉపవాసం లేదా ఒత్తిడి వంటి పరిస్థితులలో ఇది చాలా కీలకం.
అందుకు ది లివర్ డాక్ ఆన్‌గా ప్రసిద్ధి చెందిన హెపాటాలజిస్ట్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ స్పందించి పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. సోనాలి తన కేన్సర్ చికిత్స కోసం ఆధునిక వైద్యం వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. "కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సతో సహా తీవ్రమైన కేన్సర్ చికిత్సల కోసం న్యూయార్క్‌కు వెళ్లారని చెప్పుకొచ్చాడు.
2019లో ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొంది అధికారికంగా కేన్సర్ రహితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని గుర్తు చేశాడు. అంతేగాదు అధునాతన క్యాన్సర్ చికిత్స ఆసుపత్రిలో కీమోథెరపీ, రేడియేషన్,శస్త్రచికిత్స వల్లే మీకు ఉపశమనం లభించిందని పేర్కొన్నాడు. ముమ్మాటికి ఇది ప్రకృతి వైద్యం కాదని, శాస్త్రీయ చికిత్సే మీకు హెల్ప్ అయ్యిందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
దాంతో సోనాలి తాజాగా తన ఎక్స్ పోస్ట్‌లో అతడు పెట్టిన ఫోటోని స్క్రీన్‌షాట్ తీసి మరీ పోస్ట్‌లో ఇలా స్పష్టం చేసింది. ఆ కేన్సర్ వ్యాధి తెచ్చే భయం అంతా ఇంత కాదు. నొప్పి, అనిశ్చతి వంటి వాటిని తట్టుకోవాలి. అందుకు అభ్యాసం, అనుభవం అత్యంత ముఖ్యం. ఇప్పటివరకు తాను చెప్పిన వన్ని తన అనుభవం ఆధారంగా చెప్పాను.
తాను పదే పదే చెప్పినట్లుగా.. ఏ రెండు కేన్సర్లు ఒకేలా ఉండవు. అలాగే చికిత్సా విధానాలు కూడా వేరుగా ఉంటుంది. చాలా సమగ్రంగా పరిశోధన, వైద్య మార్గదర్శకత్వం తర్వాత వ్యక్తగతంలో తెలుసకున్నది ఈ ఆటోఫాగి. అప్పట్లో దీని ప్రభావం, తేడాను గమనించానని, పైగా అది నేటికి కొనసాగుతుందని పేర్కొంది. అయినా అందరూ నాతో ఏకభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..వేర్వేరు విధానాల వైపు మొగ్గు చూపుతున్నందున..తన మాటలను తోసిపుచ్చాల్సిన పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సోనాలి. తన అనుభవాన్ని చాలా నిజాయితీగా పంచుకున్నానే తప్ప తప్పుదోవ పట్టేంచే ఉద్దేశ్యమే లేదని,ప్రకృతి వైద్యాన్ని సమర్థిస్తు పోస్టు ట్టారు.
అందుకుగాను ది లివర్ డాక్ ఇలా పోస్ట్ పెట్టింది.సోనాలి బింద్రే ఒక పిచ్చిది కాదు. ఆమె సలహా తీసుకుంటున్న ప్రకృతి వైద్యుడు ఒక పిచ్చివాడు. సోనాలి బింద్రే, ఆమెకు ముందు తర్వాత చాలా మంది ఇలాగే అనుసరించి, బాధతులుగా మారారని ఫైర్ అయ్యింది. అయినా విద్య తెలివి తేటలకు, హేతుబద్ధతకు సమానం కాదు అనే విషయంపై దృష్టి పెట్టండి అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నెట్టింట ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారి, చర్చనీయాంశం గామారింది.

ప్రకృతి వైద్యం అంటే..
ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇది ఆహారం, నీరు, ఉపవాసం, వ్యాయామం, యోగా వంటి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. ఇది శరీరానికి సహజంగా ఉండే స్వస్థత శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ విధానంలో హోమియోపతి, ఆక్యుపంక్చర్, హెర్బల్ మెడిసిన్ వంటి సంప్రదాయ పద్ధతులతో పాటు, కొన్ని ఆధునిక పద్ధతులను కూడా మిళితం చేసి అందిస్తుంటారు ప్రకృతి వైద్య నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగహనం కోసం మాత్రమే ఇచ్చింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !)


