జపనీయుల్లా గుర్తు పెట్టుకుందాం..
నేటి రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో సరిగా గుర్తుండడం లేదు. చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇది చాలా మామూలు విషయమే అయినా.. అలాగే ఉంటే కొద్దికాలానికి అంటే వృద్ధాప్యం రాకమునుపే మెదడు మొద్దుబారిపోతుంది. అలా కాకుండా మెదడును చురుగ్గా ఉంచాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా జపాన్ నుంచే కొన్ని విశేషమైన జ్ఞాపకశక్తిని పెంచే పద్ధతులు వచ్చాయి. ఈ జపనీస్ చిట్కాల వల్ల మెదడు చురుకుగా మారి, విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని పొందుతుంది. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
శిసా కాన్కో
శిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం. అంటే శరీరానికి, మెదడుకి ఏకకాలంలో పని చెప్పడం లేదా మాటలు చెప్పడం. దీనివల్ల మన దృష్టి పూర్తి స్థాయిలో ఆ విషయంపైనే ఉంటుంది. జపాన్‌లో రైలు నడిపే ఆపరేటర్లు (మనదేశంలో అయితే ఇంజిన్ డ్రైవర్లు) ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తుంటారు.
కొటోడమా
జపనీయులు విశ్వసించే మరో శక్తిమంతమైన టెక్నిక్ కొటోడమా. ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదే పదే పునరావృతం చేయడం. దీనివల్ల ఆ పదం మన మెదడులో నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగం ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతిని వాడితే వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది.
ఇదీ చదవండి: స్వీపర్‌గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఉకెటమో
ఉకెటమో అనే ఈ భావన టొహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది. దీని అర్థం నిజాయితీగా అంగీకరిస్తాను. మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది చెబుతోంది.
మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించ వచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచి పోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
(టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి)
కన్ సాట్సూ
ఈ పద్ధతిని జపాన్‌లో సన్యాసులు, కళాకారులు ఎక్కువగా పాటిస్తారు. కన్ సాట్సూ అంటే చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం. మనం ఏమీ మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తే మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అన్ని విషయాలను శ్రద్ధగా గుర్తుంచుకుంటుంది. కళలతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా కనిపించే ఇది ఒక రకమైన మైండ్ ఫుల్ నెస్ టెక్నిక్.
నైకాన్
కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని అనుకుంటాం. అయితే జపనీయులు నైకాన్ అనే విధానాన్ని పాటిస్తూ.. మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని నేను ఎవరికి ఏం ఇచ్చాను..? ఎవరి నుంచి ఏం తీసుకున్నాను..? ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది..? వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తాయని వారు చెబుతున్నారు.
మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించవచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.


