
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్‌లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.
చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు.
అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్‌కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..
నిపుణులు ఏమంటున్నారంటే..
అడపాదడపా ఉపవాసం
అడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.
ఆహారాన్ని సరిగ్గా నమలడం
ఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.
ఉదయాన్నే వాకింగ్
బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.
స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్
మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్‌లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.
పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలు
బరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్‌గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు.
ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
No exercise, No running... 😏
21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024
(చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..)