ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)
అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')
ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.
ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.


