
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్‌లో వచ్చే సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి.
తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు.
JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X
— prime video IN (@PrimeVideoIN) August 18, 2025