ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా టికెట్ల ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేట్లు పెంచడం కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు తప్పు చేసిన రవికి మద్దతుగా నెటిజన్స్ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ టికెట్ల ధరలపై, దాని వల్ల ఎవరికి లాభం వస్తుందనేదానిపై తనదైన శైలీలో విశ్లేషించాడు. మల్లీప్లెక్స్‌లో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుడు ఖర్చు చేసే రూపాయిలో కేవలం 17 పైసలు మాత్రమే నిర్మాతకు వెళ్తాయని.. మిగిలినదంతా మల్టీప్లెక్స్ యాజమాన్యంతో పాటు జీఎస్‌టీకీ వెళ్తుందని ఎస్కేన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పాప్‌కార్న్, సమోస, కూల్‌డ్రింక్స్‌తో పాటు థియేటర్‌లో వచ్చే యాడ్స్‌త నిర్మాతకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు.
ఎస్కేఎన్ చెప్పిన విశ్లేషణ ప్రకారం..‘మల్టీప్లెక్స్‌లో ఒక ఫ్యామిలీ సినిమా చూసేందకు దాదాపు రూ. 2178 ఖర్చు అవుతుందట. అందులో మల్టీప్లెక్స్ మెయింటెన్స్, అక్కడ కొనుగోలు చేసే ఆహారపదార్థాలు, ఇతర సర్వీసు చార్జిలతో కలిపి. రూ. 1545 వరకు మల్టీప్లెక్స్ యాజమాన్యానికె వెళ్తుంది. నిర్మాతకు టికెట్‌పై కేవలం రూ. 372(నెట్) మాత్రమే వస్తుంది. జీఎస్‌టీ కి రూ. 182, ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్‌కి రూ. 78 వరకు వెళ్తుంది’ అని ఎస్కేఎన్ చెప్పుకొచ్చాడు.
కష్టపడి దర్శకుడుని పట్టుకొని, కథ చేయించుకొని, హీరో ని ఒప్పించి, అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఈ మొత్తంలో వచ్చేది కేవలం 17.08 శాతం మాత్రమే. నిర్మాత తెగ లాభపడిపోతున్నాడని వాదిస్తున్నవారి కోసమే ఇలా ప్రజంటేషన్‌తో ముందుకు వచ్చానని ఎస్కేఎన్ ట్వీట్ చేశాడు.
కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరో ని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఒక
ఒక ఫామిలీ మల్టీప్లెక్స్ లో
2200 ఖర్చు చేస్తే ఎంత మిగులుతుందో ఇది డిటైల్డ్ ఎనాలిసిస్ జస్ట్ 17%
పాప్‌కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్ తో నిర్మాతకి పైసా సంభంధం… pic.twitter.com/iQmD1yIsZ6— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 25, 2025


