ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Responds Court Order To Restrict Review Of Mana Shankara Vara Prasad Garu | Sakshi
Sakshi News home page

చిరు సినిమాకు రేటింగ్‌ బంద్‌.. బాధగా ఉందన్న విజయ్‌ దేవరకొండ!

Jan 11 2026 4:07 PM | Updated on Jan 11 2026 4:32 PM

Vijay Deverakonda Responds Court Order To Restrict Review Of Mana Shankara Vara Prasad Garu

టాలీవుడ్‌లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై  స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్‌ చేశారడు.

‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?

(చదవండి: మొన్న అల్లు అర్జున్‌, ఇప్పుడు ప్రభాస్‌పై కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్‌)

'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.

ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ  అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం  బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. 

(చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)

మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్‌’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్‌ ట్వీట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement