మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి(Varanasi Movie). ఇటీవలే మెగా ఈవెంట్ ఏర్పాటు చేసిన టైటిల్ రివీల్ చేశారు మన దర్శకధీరుడు. గ్లోబ్ట్రాటర్ (Globe Trotter Event) పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్కు వేలమంది అభిమానులు హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో రిలీజ్ టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా నిలిచింది. ఈ బిగ్ ఈవెంట్లో మహేశ్ బాబు వృషభంపై(బొమ్మ) వస్తూ ఎంట్రీ ఇవ్వడం ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సీన్ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో తాజాగా వీడియోను పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు జక్కన్న సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే మహేశ్ బాబు ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


