నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.
(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)
డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)


