చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.
ప్రేమలేఖ
శివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా!
ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..
యూనిట్ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్‌లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. అనిత.. గోల్‌మాల్, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ చేసింది.
సినిమా
శివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్ పెళ్లాంస్ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్‌లో యాక్ట్ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.


