‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదం పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న విడుదల కానుంది.
మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే పాటని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మారి. మిక్కీ జె. మేయర్ చక్కని సంగీతం అందించారు. ఈ మూవీలోని ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే పాట విడుదల వేడుకని భీమవరంలోని ఎస్‌కేఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం నిర్వహిస్తున్నాం’’ అని యూనిట్ తెలిపింది.


