ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్ | Dhandoraa Movie Ott Streaming Latest Update | Sakshi
Sakshi News home page

Dhandoraa OTT: 'దండోరా' ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన

Jan 10 2026 12:54 PM | Updated on Jan 10 2026 12:59 PM

Dhandoraa Movie Ott Streaming Latest Update

నటుడు శివాజీ.. కొన్నిరోజుల క్రితం హీరోయిన్లు వేసుకునే దుస్తుల గురించి చిల్లరగా మాడ్లాడాడు. ఇదంతా కూడా 'దండోరా' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానే జరిగింది. తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా డబ్బులు రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మూడు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'దండోరా' సినిమా తీశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న థియేటర్లలోకి వచ్చింది. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడిగా ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతుంది. పోస్టర్ కూడా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)

దండోరా విషయానికొస్తే.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామం. అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. ఇదే గ్రామంలో శివాజీ (శివాజీ) ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు మరణిస్తాడు. 

కుల పెద్దలు మాత్రం శివాజీ శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతమేంటి? శివాజీతో కన్న కొడుకు విష్ణు(నందు) ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందుమాధవి)కి సంబంధమేంటి అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement