రిచర్డ్ రిషి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ద్రౌపది 2’. మోహన్ .జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రక్షణ ఇందుచూడన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నేతాజి ప్రోడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రక్షణ ఇందుచూడన్‌పోషిస్తున్న ద్రౌపది దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు.
‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రం ‘ద్రౌపది 2’. ద్రౌపది దేవిగా రక్షణ ఇందుచూడన్ గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తారు. అంతేకాదు... ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి. భారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా ఈ సినిమాని గొప్పగా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్ వైబోధ, కెమెరా: ఫిలిప్ ఆర్. సుందర్.


