పాప్ మ్యూజిక్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం ‘మైఖేల్’. ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జాఫర్‌కి ఇది తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం.
నియా లాంగ్, లారా హారికర్, జూలియానో క్రూ వాల్డి, కోల్మన్ డొమింగో ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామాని ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్‌క్లైన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.


