టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.
కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


