అవతార్‌-3.. జేమ్స్ కామెరూన్ ఆ లాజిక్ ఎలా మిస్సయ్యాడు? | Avatar Director James Cameron Missed Simple logic in Part 3 | Sakshi
Sakshi News home page

Avatar -3: అవతార్‌-3కి దక్కని ఆదరణ.. ఆ చిన్న లాజిక్ మిస్సయిన జేమ్స్..!

Dec 22 2025 3:18 PM | Updated on Dec 22 2025 3:41 PM

Avatar Director James Cameron Missed Simple logic in Part 3

జేమ్స్ కామెరూన్ అవతార్‌కు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. 2009లో వచ్చిన మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత అవతార్‌-2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చివరికీ 2022లో  అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ పేరుతో రిలీజై ఆడియన్స్‌ను అలరించింది. ఈ రెండు చిత్రాలకు ఆదరణ దక్కడంతో జేమ్స్ కామెరూన్ మరో అడుగు ముందుకేసి అవతార్-3ని(అవ‌తార్ ఫైర్ అండ్ యాష్ ) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ రివ్యూస్‌ సొంతం చేసుకుంది.

అయితే మరికొందరు మాత్రం ‍అవతార్‌-3 అస్సలు బాగోలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. పార్ట్‌-3 రోటీన్‌గా అనిపించిందని.. కొత్తదనం ఏం కనిపించలేదని పోస్టులు పెట్టారు. ఈ మూవీలో కొత్తగా రెండు రకాల జీవాలను పరిచయం చేసినప్పటికీ జేమ్స్‌కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త ట్రైబ్‌ను తీసుకొచ్చినా.. విజువ‌ల్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నా.. కథ మొత్తం తిరిగి జాక్‌, క‌ల్న‌ల్ మ‌ధ్యే వార్ సాగడం ఆడియన్స్‌కు బోరు కొట్టించింది. సినిమాలో మెయిన్ విల‌న్ అంటూ వ‌రాంగ్ గురించి ఆసక్తిగా అనిపించినా మెప్పించలేకపోయింది. దీంతో అవతార్ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించడంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 

అవతార్‌ పార్ట్‌ 2 అండ్‌ పార్ట్-‌ 3 తేడా కేవలం అదొక్కటే కావడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇందులో వ‌రాంగ్ ట్రైబ్ ఒక్క‌టి అదనంగా చేర్చాడు జేమ్స్‌ కెమెరూన్. అంతా పాత కథే కావడంతో జేమ్స్ ప్రయోగం అట్టర్‌ ఫ్లాప్ అయింది. అంతేకాకుండా నిడివి కూడా మూడు గంటలకు ( 3 గంటల 17 నిమిషాలు) పైగా ఉండడం.. రోటీన్ కథ కావడం ఆడియన్స్‌కు చిరాకు తెప్పించింది. సినిమా రిలీజ్‌కు ముందు రాజమౌళి- మహేశ్‌ బాబు సెట్స్‌కు రావాలని ఉందని చెప్పడం జేమ్స్‌ కామెరూన్‌ సినిమాపై కాస్తా బజ్‌ క్రియేట్ అయినా.. ఆ ప్రచారం కూడా పెద్దగా కలిసి రాలేదు.

ఇక్కడ జేమ్స్‌ కామెరూన్‌ కేవలం విజువల్స్‌ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడడం అవతార్‌-3ని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం కూడా లేకపోవడం మరింత మైనస్‌గా మారింది. పార్ట్-1, పార్ట్‌-2 హిట్ అయ్యాయన్న ధీమాతో వచ్చిన జేమ్స్‌ కామెరూన్‌కు ఆడియన్స్‌ నాడీని పట్టుకోవడంలో ఫెయిల్‌ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రోటీన్ కథను కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌తోనే నడిపిస్తానంటే ఇప్పుడు కుదరదు. ఆడియన్స్‌ కూడా ఫుల్ అప్‌డేట్ అయి ఉన్నారు. కథలో కొత్తదనం లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్‌ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత  చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యాడన్నదే అందరికీ అంతుచిక్కని ప్రశ్న. ఇకనైనా జేమ్స్ కామెరూన్ రియలైజ్ అయి.. అవతార్‌ సిరీస్‌కు స్వస్తి చెబితే బాగుంటుందని సగటు ప్రేక్షకుడి భావన. అవతార్-4 అంటూ మరో ప్రయోగం ఇక అదొ పెద్ద సాహసమనే చెప్పాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement