గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.
(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)
టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్‌గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.
సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?
(ఇదీ చదవండి: స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత)


