చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.
మధ్య తరగతి అమ్మాయిని
అలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్‌ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు.
అవమానం
చిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు.


