స్వతహాగా తమిళ అమ్మాయి అయిన నివేదా పేతురాజ్ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. వాటిలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో ఉన్నాయి. ఈ ఏడాది తన ప్రియుడి గురించి బయటపెట్టింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేనట్లు ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే వీధి కుక్కల గురించి మాట్లాడుతూ నివేదా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
చెన్నైలో సోమవారం.. వీధి కుక్కల సంరక్షణ కోసం కొందరు ర్యాలీ చేశారు. దీనిలో నివేదా పేతురాజ్ కూడా పాల్గొంది. తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే కుక్క కాటుని అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అదేమంత పెద్ద విషయం కాదని చెప్పింది. దీంతో కొందరు ఈమెని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈమెని దారుణంగా విమర్శిస్తున్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)
'కుక్క కాటుని మనం పెద్దదిగా చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించకూడదు. మన కళ్లముందే చాలా క్రూరమైన ఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఒక్కరూ మాట్లాడరు. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ చాలా ప్రమాదకర వ్యాధి అనేది నిజం. కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు.. పరిష్కారం ఏంటో ప్రజలకు నేర్పించాలి. వీధి కుక్కల్ని చంపడం పరిష్కారం కాదు' అని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చింది.
అయితే నివేదా.. కుక్క కాటుని చాలా తక్కువగా చేస్తోందని, ఓసారి వీధి కుక్కలు ఉండేచోట కారులో కాకుండా నడుచుకుని తిరిగితే అప్పుడు సమస్య ఏంటో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె త్వరలో దుబాయికి చెందిన బిజినెన్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకోనుంది. తర్వాత ఈమె మన దేశంలో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఈ విషయాన్ని కూడా గుర్తుచేస్తున్న పలువురు నెటిజన్లు.. ఈమెని ట్రోల్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)
If a dog bites you, don't make a big deal out of it and create fear.
— #NivethaPethurajpic.twitter.com/OFFw5YpQT2— Filmy Bowl (@FilmyBowl) November 24, 2025


