హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా ‘అరసన్’ (తెలుగులో ‘సామ్రాజ్యం’). కలైపులి ఎస్. థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. అయితే విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.
ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (తెలుగులో ‘నవాబు’) సినిమా తర్వాత శింబు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అలాగే వెట్రిమారన్ దర్శకత్వం వహించిన గత చిత్రం ‘విడుదలై’ తర్వాత ఆయన దర్శకత్వంలోని తాజా చిత్రం ‘అరసన్’లోనూ విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్‌లో నటిస్తుండటం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత, శ్రీలీల వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.


