breaking news
Anitha chowdary
-
నటికి లవ్ లెటర్ రాశా: శివాజీ రాజా
చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.ప్రేమలేఖశివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా! ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..యూనిట్ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్‌లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. అనిత.. గోల్మాల్, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ చేసింది.సినిమాశివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్ పెళ్లాంస్ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్లో యాక్ట్ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.చదవండి: అమ్మను అవమానించారు: మృణాల్ ఠాకూర్ -
'ఛత్రపతి' సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
Chatrapathi Movie Child Artist Suridu: ఛత్రపతి సినిమా ప్రభాస్ రేంజ్‌ను పదిరెట్లు పెంచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 16 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు కూడా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా సూరీడు ఓ సూరీడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టి చంపడంతో అప్పటివరకు అణిగిమణిగి ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్‌కు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. ఇక ఈ సినిమాలో సూరీడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ వంశీ ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన అతడు మొదటి రౌండ్లోనే సెలక్ట్ అయ్యాడట. అతడి అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూరీడుగా అతడే చేయాలని ఫిక్సయ్యాడట. ఆయన అంచనా కూడా నిజమైంది. సినిమాలో సూరీడు మదర్ సెంటిమెంట్ సీన్ ఇప్పుడు చూసినా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి సూరీడు పాత్ర బాగా పనికొచ్చింది. తాజాగా ఈ సూరీడు హీరో రేంజ్‌లోకి మారిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో భశ్వంత్ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఛత్రపతి సినిమాలో భశ్వంత్ వంశీ, అనిత చౌదరీ తల్లీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే కదా! తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో గడ్డం, మీసాలతో సూరీడు గుర్తుపట్టరానంతగా మారిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న అతడు టాలీవుడ్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడట. అంటే మంచి అవకాశం దక్కితే త్వరలోనే సూరీడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. -
బీరువా మూవీ ప్రెస్ మీట్


