breaking news
Sapthami Gowda
-
తమ్ముడు మూవీ రివ్యూ
టైటిల్: తమ్ముడునటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్ రాజు, శిరీష్దర్శకత్వం: శ్రీరామ్ వేణుసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్ఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్‌ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కల్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ ‘తమ్ముడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్‌తో విలన్‌ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్ కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లా ఫైట్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. ఓవరాల్‌గా తమ్ముడు గుడ్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాలి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్ సినిమా ఇది. రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా సెకండాఫ్ అంతా బోరింగ్‌గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్ అయింది. వేణు శ్రీరామ్ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్‌గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్‌లో ఒక సీన్ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్ 1.75 రేటింగ్ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025 -
తమ్ముడుతో టాలీవుడ్లో ఎంట్రీ.. అప్పుడే లైన్లో పెట్టేసిందిగా! (ఫోటోలు)
-
పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా చూలేదు : కాంతర హీరోయిన్
‘పుష్ప’ చిత్రంలో రష్మిక చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆఫర్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. కానీ కాంతర సక్సెస్ తర్వాత నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇదే. డిఫరెంట్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తా. కమర్షియల్ సినిమా చేయడం కూడా ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ చిత్రమే’ అని అన్నారు కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సప్తమి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి "తమ్ముడు" మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. "తమ్ముడు" మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.→ అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది.→ "తమ్ముడు" కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది.→ కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.→ పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను ఆ సినిమాను చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.→ "తమ్ముడు" సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.→ ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు "తమ్ముడు" మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.→ ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. -
నితిన్ 'తమ్ముడు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ ఈవెంట్.. హీరోయిన్ల సందడి (ఫోటోలు)
-
నితిన్ ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)
-
గ్లామరస్ జాన్వీ కపూర్.. చిన్నపిల్లలా మృణాల్ క్యూట్ నెస్!
హాయ్ నాన్న జ్ఞాపకాలు షేర్ చేసిన మృణాల్మెరుపుల డ్రస్సుతో కాక రేపుతున్న జాన్వీ కపూర్గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లిన నవదీప్-తేజస్వి మదివాడరంజాన్ సీజన్.. ఛార్మినార్ దగ్గర వితికా షేర్ సందడిచీరలో క్యూట్ నెస్ తో కట్టేపడేస్తున్న బిగ్ బాస్ దివిఎర్రచీరలో కలర్ ఫుల్ గా హీరోయిన్ చాందిని చౌదరిబ్లాక్ శారీలో బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ గ్లామర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) -
బాధలో 'కాంతార' హీరోయిన్.. పోస్ట్ వైరల్
'కాంతార' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటి సప్తమి గౌడ (Sapthami Gowda) బాధపడుతోంది. తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. పెడ్ డాగ్ తో ఉన్న బోలెడన్ని జ్ఞాపకాల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)బెంగళూరుకి చెందిన సప్తమి గౌడ.. 2020 నుంచి సినిమాల్లో నటిస్తోంది. 'కాంతార'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమైంది. గతేడాది 'యువ' అనే మూవీ చేసింది. ప్రస్తుతం 'కాంతార' మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. ఇకపోతే తన ఇంట్లో 2010 నుంచి పెంచుకుంటున్న పెంపుడు కుక్క సింబా చనిపోయిందని సప్తమి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) -
గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్
-
'కాంతార' బ్యూటీ.. షార్ట్‌లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. -
నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్ హీరోయిన్ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంత అందంగా మారిన కాంతార హీరోయిన్ సప్తమి గౌడ (ఫొటోలు)
-
కాంతార బ్యూటీ సప్తమి గౌడ గురించి ఈ విషయాలు తెలుసా?
‘కాంతార’లో ప్రేక్షకులను ఆకర్షించిన నటి సప్తమి గౌడ. వరుస అవకాశాలతో స్టార్డమ్ వైపు పరుగెడుతున్న ఆమె పరిచయం క్లుప్తంగా.. సప్తమి స్వస్థలం బెంగళూరు. ఆమె చదువూ అక్కడే సాగింది. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే పలుమార్లు స్టేట్, నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. నటన మీదున్న ఆసక్తితో .. అవకాశాల కోసం ముందు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తొలిసారి కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’తో వెండి తెరపై మెరిసింది. ఈ చిత్రంలో తన నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్‌ను అందుకుంది. ‘కాంతార’తో ఊహించని విజయాన్ని సాధించిన సప్తమి.. తన యాక్టింగ్ డేట్స్ కోసం మూవీ చాన్స్‌లు పడిగాపులు పడే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ‘ద వ్యాక్సిన్ వార్’, ‘యువ’, ‘కాళి’, ‘కాంతార ప్రీక్వెల్’ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. త్వరలోనే హీరో నితిన్ ‘తమ్ముడు’తో తెలుగులోనూ అలరించనుంది. ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటాను. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు వర్క్ అవుట్స్ ఎక్కువగా చేస్తుంటాను. -సప్తమి గౌడ View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) చదవండి: సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరంటే..