
కాంతార బ్యూటీ సప్తమి గైడ చిన్నతనం నుంచే చదువులో, క్రీడల్లో రాణించింది. పలు స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. తండ్రి కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి కావడంతో తనూ పోలీస్ అవ్వాలనుకుంది. కానీ అనుకోకుండా నటిగా మారింది. చేసింది నాలుగు సినిమాలే అయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది.

జూలై 4న రిలీజవుతున్న నితిన్ 'తమ్ముడు' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. పుష్పలో రష్మిక తరహా పాత్రలు చేయాలనుందని చెప్తోంది. ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది.

















