Thammudu Movie
-
బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్‌స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే..మళ్లీ సినిమా చాన్స్‌లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.‘విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆ సినిమా ఫస్డ్డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది. -
గురి తప్పదు తమ్ముడు
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్‌గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్. -
రిలీజ్ డేట్ ఎప్పుడు?
‘‘ఇవాళ నా పుట్టినరోజు... ఎవరొచ్చినా లోపలికి పంపించు’’ అంటూ వచ్చేవాళ్లు చెప్పే శుభాకాంక్షల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూశారు దర్శకుడు శ్రీరామ్ వేణు. అయితే వచ్చిన లయ, స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు? చెబుతారా చెప్పరా?’ అంటూ కాస్తంత కోపంగా అడగడంతో, శ్రీరామ్ వేణు ఖంగు తిన్నారు. పైగా బేబీ శ్రీరామ్ దీత్య అయితే ‘నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?’ అని అడగడంతో, బర్త్‌డే విషెస్ చెబుతారని ఆశిస్తే, ఇలా షాక్ ఇచ్చేరేంటి అనుకుంటూ సర్ది చెప్పి, పంపించేస్తారు.చివరికి నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ నవ్వుకుంటూ... శ్రీరామ్ వేణుతో, రిలీజ్ది ఏముందీ? కేక్ కట్ చేద్దువుగాని అంటూ, జూలై 4న థియేటర్లలో ‘తమ్ముడు’ అని రాసి ఉన్న కేక్‌ని కట్ చేయించారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు చేశారు. ఆదివారం (మే 4) శ్రీరామ్ వేణు బర్త్ డే సందర్భంగా పైన పేర్కొన్న విషయాలతో తయారు చేసిన ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అసలు నేను సినిమాలో ఉన్నానా?.. డైరెక్టర్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన లయ!
రాబిన్‌హుడ్ తర్వాత నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.డైరెక్టర్ వేణు శ్రీరామ్ పుట్టినరోజు కానుకగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ దగ్గరికి వచ్చిన హీరోయిన్లు బర్త్ డే విషెస్‌కు బదులుగా మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు సార్?అని అడుగుతారు. దీంతో ఆయన కాస్తా షాకింగ్‌కు గురవుతారు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరో సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ లయ కూడా దర్శకుడితో మూవీ విడుదల తేదీ గురించే ఆరా తీస్తుంది.అసలే నేను తెలుగమ్మాయిని.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నా.. నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ను ప్రశ్నిస్తుంది. 'ఒక్క పోస్టర్ లేదు.. అప్డేట్ లేదు.. కనీసం సినిమా రిలీజ్ డేట్ అయినా చెప్పండి.. వెళ్లి థియేటర్లోనే చూసుకుంటా' అని లయ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ మూవీ ప్రమోషన్లలో ఇదొక డిఫరెంట్ వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. వేణు శ్రీరామ్- నితిన్ కాంబోలో వస్తోన్న తమ్ముడు మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్‌రాజు, అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ మూవీ హిట్ కాకపోవడంతో నితిన్ ఫ్యాన్స్ తమ్ముడిపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు. మరీ వారి అంచనాలకు తగినట్లుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే జూలై 4వరకు వేచి చూడాల్సిందే.Just as I asked, they’ve announced it!😏#Thammudu releasing on July 4th, 2025🎯#HBDSriramVenu sir #ThammuduOnJuly4th❤️🎂@actor_nithiin #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish @SVC_official @AJANEESHB pic.twitter.com/zw4zLuR6QD— Sapthami Gowda (@gowda_sapthami) May 4, 2025An Ambitious & Powerful Saga Will Ignite Big Screens🔥Feel the pulse of Action, emotion & adrenaline!💥#Thammudu Hitting the Bullseye on July 4th, 2025🎯#ThammuduOnJuly4th@actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish… pic.twitter.com/bIlA0oWOHH— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2025 -
తెలుగులో తొలి సినిమా.. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తిరుపతిలో
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నేళ్లకు తిరుమల కొండపై కనిపించింది. ఈమెని చూసి తొలుత గుర్తుపట్టలేదు కానీ తర్వాత ఈమె ఎవరో తెలిసి అవాక్కవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?'హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి' ఈ పాట వినగానే మీకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు కదా! ఇదే సాంగ్‌లో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెనే. ఈ బ్యూటీ పేరు అదితి గోవిత్రికర్. ముంబైకి చెందిన అదితి స్వతహాగా డాక్టర్. కానీ ఈ కోర్స్ చేస్తున్న టైంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లో కనిపించి తెలుగులో 'తమ్ముడు' మూవీలో ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: హీరోయిన్ కావ్య థాపర్)1999లో 'తమ్ముడు' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న అదితి.. 'మౌనమేలనోయి' అని మరో తెలుగు మూవీ చేసింది. దీని తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 2021 వరకు హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లాక్ డౌన్ తర్వాత నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు చేసింది. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం ఈమె చేతిలో లేవు.తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని అదితీ గోవిత్రికర్ దర్శించుకుంది. బయటకొచ్చిన తర్వాత ఈమెని వీడియో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 'తమ్ముడు' హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు. అదితి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్ని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మనస్పర్థలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పిల్లలతో కలిసి ఉంటోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు'
*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
అతిథి పాత్రకు సై?
అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ తెలుగు సినిమా అంగీకరించి దాదాపు రెండేళ్లయింది. ప్రస్తుతం తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... నిత్యా మీనన్ స్ట్రయిట్ తెలుగు సినిమా సంగతి ఏంటి? అంటే... ఆమె ఓ తెలుగు సినిమా అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమాలో అతిథి పాత్రకు సై అన్నారట నిత్య. గతంలో నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా రూ΄÷ందుతున్న ‘తమ్ముడు’లో సప్తమీ గౌడ కథానాయికగా నటిస్తున్నారు. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఉన్న కీలకమైన అతిథి పాత్రకు నిత్యా మీనన్‌ని తీసుకున్నారని సమాచారం. -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
-
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
నితిన్ ‘తమ్ముడు’ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
నితిన్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్ ఖరారైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొన్ని సినిమా టైటిల్స్ చాలా బాధ్యతతో వస్తుంటాయి. మీ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా చేస్తాం’’ అని పేర్కొన్నారు నితిన్. ‘‘సెప్టెంబర్ 1నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘దంగల్, కహానీ, తారే జమీన్ పర్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు వర్క్ చేసిన సత్యజిత్ పాండే (సేతు) ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే అక్క– తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్ టాక్. -
‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉంది? ఎం చేస్తుంది?
‘హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి’ ఈ పాట వినగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఎర్ర చొక్కాలో లుంగీ కట్టిన పవన్ కల్యాణ్ మన కళ్ల ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఓ బ్యూటీ బ్లాక్ టీషర్ట్ వేసీ రైల్వే స్టేషన్లో అలా నడుస్తున్నట్లు కనిపిస్తుంది కదా? ఆ బ్యూటీ పేరే అదితి గోవిత్రికర్. . 1999లో తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందాల భామ, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘సోచ్’ అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ’16 డిసెంబర్’, ‘బాజ్’, ‘డే దనా దన్’, ‘భేజా ఫ్రై 2’, ‘స్మైల్ ప్లీజ్’, ‘కోయి జానే నా’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అవేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అదితి. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ లండన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఇక అదితి వ్యక్తిగత విషయాలకొస్తే.. 1998లోనే దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్ళాడింది. ఇద్దురు పిల్లలు పుట్టాక వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు దూరమయ్యారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అదితి తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్‌తో నివసిస్తోంది. View this post on Instagram A post shared by Dr Aditi Govitrikar (@aditigovitrikar)