జై శివనాయకీ... | Jai Bagalamukhi lyrical Song released from Nithiin Thammudu | Sakshi
Sakshi News home page

జై శివనాయకీ...

Jun 25 2025 12:28 AM | Updated on Jun 25 2025 12:28 AM

Jai Bagalamukhi lyrical Song released from Nithiin Thammudu

∙బేబీ శ్రీరామ్‌ దిత్య, లయ

‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమకారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని....’ అంటూ సాగుతుంది ‘తమ్ముడు’ సినిమాలోని ‘జై బగళాముఖీ’ పాట. నితిన్‌ హీరోగా నటించిన చిత్రం ఇది. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్‌ దిత్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.

ఈ సినిమాలోని ‘జై బగళాముఖీ...’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘‘కొండ కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారీ... గుండె గుండెలో అఖండ జ్యోతిగ వెలుగుచుండు ఓంకారి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీతదర్శకుడు అజనీష్‌ లోకనాథ్‌ నేతృత్వంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ పాటను వి. అబ్బి ఆలపించారు. ‘‘శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారి మహిమను కీర్తిస్తూ సిని మాలో జరుపుకునే గ్రామ జాతర సందర్భంగా ఈ పాట వస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement