Thammudu Movie: ఆకట్టుకుంటున్న 'భూ అంటూ భూతం..' సాంగ్‌ | Bhuu Antuu Bhuutham Lyrical Song Out From Thammudu Movie | Sakshi
Sakshi News home page

Thammudu Movie: ఆకట్టుకుంటున్న 'భూ అంటూ భూతం..' సాంగ్‌

Jun 17 2025 5:31 PM | Updated on Jun 17 2025 5:53 PM

Bhuu Antuu Bhuutham Lyrical Song Out From Thammudu Movie

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. 'భూ అంటూ భూతం..' పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. 

'భూ అంటూ భూతం..'  పాట ఎలా ఉందో చూస్తే - 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట.

Advertisement
 
Advertisement
Advertisement