తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సినీ తారలు శ్రీలీల, గౌరీ ప్రియ దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీలీల తన తల్లి స్వర్ణలతతో కలిసి తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం గౌరీ ప్రియ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ పండితులు ఇరువురికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఆలయం వెలుపల సినీ తారలను చూసిన భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(ఇదీ చదవండి: బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..)
Actresses #Sreeleela and #GouriPriya spotted waiting in the darshan queue at Tirumala Sri Venkateswara Temple during the early hours today! 🙏❤️✨ #Tirumala #DareDevil https://t.co/IDO84eYYDx
— Vasanth Raj (@vasanthraj001) November 13, 2026


