మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో మెప్పించారు.
తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైంది. ఇండియన్ పనోరమా (ఫీచర్ ఫిల్మ్స్) విభాగంలో సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
From rewriting box-office history to earning national recognition ❤️🔥 The ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru adds another prestigious feather to its cap with its official selection for the Indian Panorama (Feature Films) at the 57th International Film Festival of India (IFFI) 2026💥 An @AnilRavipudi Film 🔥 Megastar @KChiruTweets Victory @VenkyMama #Nayanthara #Bheemsceciroleo @CatherineTresa1 @sahugarapati7 @sushkonidela #Archana @YoursSKrishna @Shine_Screens @GoldboxEnts @tseriessouth
— Shine Screens (@Shine_Screens) November 13, 2026


